Tollywood: నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ కు పాజిటివ్ టాక్.. మరో ఫన్నీ ట్వీట్ వదిలిన హీరో నాని!

  • నిన్న విడుదలైన నానీస్ ‘గ్యాంగ్ లీడర్’
  • సినీ విమర్శల నుంచి ప్రశంసలు
  • నానిపై ప్రశంసలు కురిపించిన అనిరుధ్

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన ఒక్క రోజులోనే నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో హీరో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిన్న ‘సినిమా హిట్టయితే నిద్రలేపండి. లేదంటే డిస్టర్బ్ చేయొద్దు’ అంటూ సీనియర్ నటి లక్ష్మి భుజంపై నిద్రపోతున్న ఫొటోను నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

తాజాగా హీరో నాని తనకూ, సీనియర్ నటి లక్ష్మీకి మధ్య సంభాషణ జరుగుతున్నట్లు సరదాసరదాగా ఓ ట్వీట్ చేశాడు. అందులో నాని మాట్లాడుతూ.. ‘ఏంటి బామ్మా?.. ఇంత వయొలెంట్ గా  లేపేశారు?’ అని  అడిగితే, లక్ష్మి స్పందిస్తూ..‘ఒకసారి ట్విట్టర్ లో నీ మెన్షన్స్ చూసుకో’ అని జవాబిచ్చినట్లు ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి మరో ఫొటోను కూడా నాని జతచేశాడు. అంతలోనే గ్యాంగ్ లీడర్ సంగీత దర్శకుడు అనిరుధ్ స్పందిస్తూ..‘నిద్రలేచే సమయం వచ్చేసింది బ్రదర్.. ఇంకో సూపర్ హిట్ సినిమా కొట్టారు’ అని ప్రశంసించాడు.

Tollywood
Nani
Gang leader
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News