Ramdas Athawale: యుద్ధం వద్దనుకుంటే పీవోకేను మీ అంతట మీరే అప్పగించండి: ఇమ్రాన్ ఖాన్ కు కేంద్రమంత్రి హెచ్చరిక

  • పీవోకేను భారత్ కు అప్పగించడమే మీకు మంచిది
  • పీవోకేలోని ప్రజలు భారత్ లో కలసిపోవాలనుకుంటున్నారు
  • ఇది సీరియస్ మ్యాటర్ అన్న రాందాస్ అథవాలే

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తో యుద్ధం వద్దనుకుంటే పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను మీ అంతట మీరే మాకు అప్పగించండని వార్నింగ్ ఇచ్చారు. చండీగఢ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పీవోకేను భారత్ కు అప్పగించడమే పాకిస్థాన్ కు మంచిదని అన్నారు.

పీవోకేలో నివసిస్తున్న ప్రజలు పాకిస్థాన్ తో కలసి ఉండాలనుకోవడం లేదని... భారత్ లో కలసిపోవాలనుకుంటున్నారనే రిపోర్టులు వస్తున్నాయని తెలిపారు. కశ్మీర్ లోని మూడింట ఒక వంతు భూభాగాన్ని గత 70 ఏళ్లుగా పాకిస్థాన్ ఆధీనంలో ఉంచుకుందని మండిపడ్డారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని అన్నారు. పీవోకే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన వ్యూహాలు ఉన్నాయని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే అథవాలే ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News