Telugudesam: ఎన్ని పార్టీలు మారానన్నది కాదు అభివృద్ధే ముఖ్యం: తోట త్రిమూర్తులు

  • కార్యకర్తల సహకారం మర్చిపోలేను
  • గెలుపోటముల ప్రస్తావన లేకుండా ప్రజల మనసు గెలిచా
  • టీడీపీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు

ఎన్ని పార్టీలు మారానన్నది ముఖ్యం కాదని, అభివృద్ధే తనకు ముఖ్యం అని తోట త్రిమూర్తులు అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లూ తనకు కార్యకర్తలు అందించిన సహకారం మర్చిపోలేనిదని చెప్పారు. గెలుపోటములతో ప్రస్తావన లేకుండా ప్రజల మనసు గెలిచానని అన్నారు. చంద్రబాబునాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో తాను మనస్తాపం చెందానని అన్నారు. తాను పార్టీ మారినా టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదన్న ఆయన వ్యాఖ్యలకు బాధపడ్డానని, అందుకే, టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు.

Telugudesam
Thota Trimurthulu
Ramchandrapuram
  • Loading...

More Telugu News