Telugudesam: మంగళగిరి టీడీపీ నేతకు పితృవియోగం... నారా లోకేశ్ పరామర్శ

  • టీడీపీ నేత కొల్లి శేషు తండ్రి అనారోగ్యంతో మృతి
  • స్పందించిన నారా లోకేశ్
  • కొల్లి శేషు తండ్రి భౌతిక కాయానికి నివాళులు

మంగళగిరి నియోజకవర్గం పెనుమాక టీడీపీ నేత కొల్లి శేషు తండ్రి కొల్లి కాంతారావు మృతి చెందడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. కొల్లి శేషు తండ్రి అనారోగ్యంతో మరణించారని తెలుసుకున్న లోకేశ్ వెంటనే ఆయన నివాసానికి వెళ్లారు. పితృ వియోగంతో బాధపడుతున్న నేతను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొల్లి కాంతారావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. దీనిపై ట్విట్టర్ లో ఫొటోలు పోస్టు చేశారు.

Telugudesam
Mangalagiri
Nara Lokesh
Kolli Seshu
  • Loading...

More Telugu News