Nalgonda: నల్గొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం రసాభాస!
- టీడీపీ కార్యాలయంలో టీడీపీ వర్గాలు బాహాబాహీ
- హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎన్నికపై గొడవ
- ఇరువర్గాల నాయకుల మధ్య తోపులాట, వాగ్వాదం
నల్గొండలో టీడీపీ సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ నేతలు ఈ సమావేశానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య అది ఘర్షణకు తావుతీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన నాయకులు తోపులాటకు దిగారు. ఓ దశలో పరస్పరం దాడులకు దిగారు. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయినట్టు సమాచారం. హుజూర్ నగర్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కిరణ్మయి ఎన్నిక విషయమై ఈ గొడవ మొదలైంది. బీజేపీకి సహకరించిన ఆమెను ఇంఛార్జ్ గా ఎలా నియమిస్తారని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.