Andhra Pradesh: నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాల్సిందే.. మంగళగిరిలో దళిత సంఘాలు, వైసీపీ భారీ ర్యాలీ!

  • దళిత మహిళా ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారు
  • ఆమెను అరెస్ట్ చేయాల్సిందేనన్న ఆందోళనకారులు
  • టీడీపీ నేత తీరుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి తనను కులం పేరుతో దూషించారని గుంటూరులో మహిళా ఎస్సై అనురాధ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇటీవల చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో వైసీపీ, దళిత సంఘాలు ఈరోజు నన్నపనేని తీరుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టాయి.

ఈ ర్యాలీలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నన్నపనేని రాజకుమారి దళిత మహిళా ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారని, ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని తీరుపై ఎమ్మెల్యే ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
YSRCP
Dalit community
Rally
Manalagiri
Rk
Nannapaneni rajakumari
  • Loading...

More Telugu News