Simhadri Appanna: సింహాద్రి అప్పన్నకు చిరంజీవి భార్య సురేఖ ప్రత్యేక పూజలు!

  • స్వాగతం పలికిన అధికారులు
  • నృసింహుని, గోదాదేవిని దర్శించుకున్న సురేఖ
  • తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు

సినీ నటుడు, మాజీ ఎంపీ చిరంజీవి భార్య సురేఖ, సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. సింహాచలం వచ్చిన ఆమె, వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి రాగా, దేవస్థానం ఏఈఓ రామారావు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. స్వామికి, గోదాదేవి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం సురేఖకు వేదమండపంలో పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందించారు.

వచ్చే నెల 2న చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా' ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో, సినిమా హిట్ కావాలని ఆమె పూజలు జరిపించినట్టు సమాచారం. ఇక సురేఖను చూసేందుకు ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు పోటీ పడ్డారు.

Simhadri Appanna
Simhachalam
Chiranjeevi
surekha
  • Loading...

More Telugu News