Andhra Pradesh: గుంటూరులో ఆకతాయిల హల్ చల్.. 13 బైక్ లను తగులబెట్టిన వైనం!

  • గుంటూరులోని నల్లచెరువులో ఘటన
  • అర్ధరాత్రి సమయంలో వాహనాలను తగులబెట్టిన ఆకతాయిలు
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 13 బైక్ లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన గుంటూరు శివార్లలోని నల్లచెరువు వద్ద చోటుచేసుకుంది. నల్లచెరువు ప్రాంతంలోని స్థానికులు తమ వాహనాలను ఇంటిబయట పార్క్ చేశారు. అయితే కొందరు దుండగులు నిన్న అర్ధరాత్రి దాటాక బైక్ లపై అక్కడికి చేరుకున్నారు.

అనంతరం వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో ద్విచక్ర వాహనాలకు వ్యాపించిన మంటలను ఆర్పేందుకు ఎవరికీ అవకాశం లేకపోయింది. తమ వాహనాలు కాలి బూడిదవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Andhra Pradesh
Guntur District
13 BIKES
TORCHED
  • Loading...

More Telugu News