Mahesh Babu: మహేశ్ బాబు ట్వీట్ కు అద్భుతమైన రీతిలో బదులిచ్చిన విజయశాంతి!

  • కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతితో నటించిన మహేశ్
  • మహేశ్ లో అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ లేదన్న విజయశాంతి
  • ట్విట్టర్ లో స్పందన

సీనియర్ నటి విజయశాంతితో కలిసి ముప్పై ఏళ్ల క్రితం కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో నటించిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ మహేశ్ బాబు ఓ ట్వీట్ చేయడం తెలిసిందే. విజయశాంతితో తన చిన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు. దీనిపై విజయశాంతి స్పందించారు.

 "కాలక్రమంలో ప్రకృతి శక్తుల్లో కూడా మార్పు రావొచ్చేమో కానీ, మన మహేశ్ బాబు స్వభావం అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. పాలబుగ్గల పసితనం ఇంకా అలాగే ఉంది. ఆ క్యూట్ నెస్సే అతడికి ఆభరణం. మా ఇద్దరి కాంబినేషన్ 1989లో మొదలైంది. సరిగ్గా 1980లో ఇదే రోజున సూపర్ స్టార్ కృష్ణ గారితో కిలాడీ కృష్ణుడు చిత్రంలో నటించాను" అంటూ ట్వీట్ చేశారు.

Mahesh Babu
Vijayasanthi
Krishna
Tollywood
  • Loading...

More Telugu News