Nizamabad District: పార్టీలో ఇమడలేకపోతున్నా.. రాజీనామా చేసేందుకూ సిద్ధమే: టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్

  • పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు
  • కేసీఆర్ దయతోనే ఎమ్మెల్యేగా గెలిచా 
  • కేసీఆర్ ను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కు ఆయన ‘గుడ్ బై’ చెబుతారన్న వార్తల ప్రచారం నేపథ్యంలో షకీల్ స్పందించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు లభించడం లేదని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా పార్టీలో ఇమడలేకపోతున్నానని, అవసరమైతే, రాజీనామా చేసేందుకూ సిద్ధంగా ఉన్నానని అన్నారు. కేసీఆర్ దయతోనే ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పిన షకీల్, కేసీఆర్ ను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు.

Nizamabad District
Bodhan
Mla
TRS
Shakil
  • Loading...

More Telugu News