YSRCP: సుజనా చౌదరి అడిగితే ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పాలా?: మంత్రి బొత్స

  • గతంలో టీడీపీలో ఉన్నోళ్లే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారు
  •  సుజనా చౌదరి మూలాలు ఇంకా టీడీపీలోనే ఉన్నాయి
  • పార్టీ కండువా మారింది తప్ప ఆయన ఆలోచనా తీరు మారలేదు

ఏపీ రాజధాని అమరావతి గురించి మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, దీనిపై సీఎం జగన్ స్పందించాలని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుజనా చౌదరి అడిగితే ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు.

నిన్నటి వరకూ టీడీపీలో ఉన్నవారే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారని, పార్టీ కండువా మారింది తప్ప, సుజనా చౌదరి ఆలోచనాతీరు మారలేదని విమర్శించారు. సుజనా చౌదరి మూలాలు ఇంకా టీడీపీలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. రాజధాని ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించింది కాదని అన్నారు. గత ప్రభుత్వం ఆరు వేల కోట్లకు పైగా రాజధానిలో ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారని, ఆ నిధులు ఏమయ్యాయో తేలాల్సి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News