Andhra Pradesh: ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థికసాయం... ఈ నెల 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు
  • దరఖాస్తులకు తుది గడువు ఈ నెల 25
  • ఫైనాన్స్ తో వాహనాలు తీసుకున్న వారికి కూడా పథకం వర్తింపు

ఏపీలో ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. వచ్చే నెల 4 నుంచి ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తున్నామని వెల్లడించారు. అర్హులైన లబ్దిదారుల ఎంపిక కోసం ఈ నెల 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ప్రయోజనం పొందాలంటే ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 25వ తేదీ తుది గడువు అని వెల్లడించారు. ఫైనాన్స్ తో వాహనాలు తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ పథకంలో భాగంగా లబ్దిదారులు కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరవాల్సి ఉంటుందని చెప్పారు. 4 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్టు ప్రభుత్వ అంచనా అని పేర్కొన్నారు. అంచనాలకు మించి లబ్దిదారులు వచ్చినా పథకం అమలు చేస్తామని పేర్ని నాని వివరించారు. అయితే, ప్రస్తుతానికి టూవీలర్ ట్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకం వర్తించదని, వచ్చే ఏడాది నుంచి టూ వీలర్ ట్యాక్సీ డ్రైవర్లకు కూడా ఆర్థికసాయం అందించే ఆలోచన చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News