Chittoor District: మాజీ ఎంపీ శివప్రసాద్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు

  • వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచన
  • తీవ్రమైన వెన్నునొప్పితో చెన్నై ఆసుపత్రిలో చేరిన మాజీ ఎంపీ
  • చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు విజయం

చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారన్న  సమాచారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అలాగే ఆయనను చేర్చిన ఆసుపత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న శివప్రసాద్ ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సినీ నటుడైన శివప్రసాద్‌ తన విలక్షణ శైలి, విచిత్ర వేషధారణలతో ఎంపీగా ఉండగా నిత్యం వార్తల్లో ఉండేవారు. ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, అంబేడ్కర్..ఇలా రోజుకో వేషంతో పార్లమెంటు ముందు నిలబడి పలు పార్టీల నాయకులను విశేషంగా ఆకట్టుకునే వారు. చిత్తూరు నుంచి 2009, 2014లో రెండు సార్లు టీడీపీ తరపున గెలిచిన ఆయన గత ఎన్నికల్లో ఇదే స్థానంలో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. 

Chittoor District
ex MP sivaprasad
hospitalized
Chandrababu
  • Loading...

More Telugu News