Chittoor District: యువకుడితో ఇద్దరమ్మాయిల పరారీ... పలమనేరులో ఇదే హాట్ టాపిక్!

  • ఇద్దరు యువతులతో యువకుడి స్నేహం
  • ఇంట్లోని డబ్బు తీసుకుని పారిపోయిన ముగ్గురూ
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఇద్దరు యువతులు ఓ యువకుడితో కలిసి పారిపోయిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో జరగడంతో, ఈ ప్రాంతంలో హాట్ టాపిక్ అయింది. ముగ్గురి మధ్యా ప్రేమ వ్యవహారం ఉందా? లేక మరేదైనా కారణంతో పారిపోయారా? అన్న విషయమై స్పష్టత లేదు.

పలమనేరు సీఐ శ్రీధర్‌ వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పందేరుపల్లి ఒడ్డూరుకు చెందిన నాగమ్మ కుమారుడు రాజశేఖర్‌ (20) గ్రామంలో ఉంటుండగా, అదే ఊరికి చెందిన ఇద్దరు అమ్మాయిలు అతనితో చాలా స్నేహంగా ఉండేవారు. ఈ నెల ప్రారంభంలో ఇంట్లో దాచిన రూ. 12 వేలు తీసుకుని, తన బైక్ తో సహా రాజశేఖర్ కనిపించకుండా పోయాడు.

కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాల్లో, బంధుమిత్రుల ఇళ్లలో గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే సమయంలో రాజశేఖర్ తో పరిచయం పెంచుకున్న ఇద్దరు యువతులు కూడా కనిపించకుండా పోయారు. ఆపై ముగ్గురూ కలిసి ఊరు దాటారని తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, వారు ఎక్కడున్నారన్న విషయమై విచారణ ప్రారంభించారు.

Chittoor District
Palamaneru
Two Girls
Young boy
  • Loading...

More Telugu News