Snake Bite: ఫోన్ మాట్లాడుతూ పాములపై కూర్చున్న మహిళ... కాటేసిన వైనం!

  • ఉత్తరప్రదేశ్ లో విషాదకర ఘటన
  • బెడ్రూమ్ లోకి చేరిన పాములు 
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫోన్ లో మాట్లాడుతూ ఓ మహిళ రెండు పాములపై కూర్చుంది. వెంటనే అవి ఆమెను కాటేశాయి. వివరాల్లోకి వెళ్తే, థాయ్ లాండ్ లో పని చేస్తున్న తన భర్తతో ఫోన్ లో మాట్లాడుతూ, ఇంట్లోని బెడ్రూమ్ లోకి ఆమె వచ్చింది.

అయితే, అంతకు ముందే ఇంట్లోకి వచ్చిన రెండు పాములు బెడ్ పై ఉన్నాయి. వాటిని గమనించకుండా ఆమె వాటిపై కూర్చోవడంతో అవి కాటేశాయి. కొన్ని నిమిషాల్లోనే ఆమె స్పృహ కోల్పోయింది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరోవైపు, ఆ రెండు పాములను కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు చంపేశారు.

Snake Bite
Uttar Pradesh
Women
  • Loading...

More Telugu News