Jayasri Ramayya: ఆస్తి కోసం మేనమామ శారీరకంగా వేధిస్తున్నాడు: కన్నడ సినీ నటి జయశ్రీ రామయ్య ఫిర్యాదు

  • అర్ధరాత్రి తల్లిని గెంటేశాడు
  • నా దుస్తులు బాగాలేవంటూ దూషణలు
  • మేనమామకు పోలీసుల విచారణ నోటీసులు

తన ఆస్తి కోసం సొంత మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కన్నడ నటి, ప్రముఖ డ్యాన్సర్ జయశ్రీ రామయ్య సంచలన ఆరోపణలు చేసింది. సీకె అచ్చుకట్టె పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి ఫిర్యాదు చేసిన ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడింది. తాను సంపాదించిన ఆస్తికి సంబంధించి మేనమామ గిరీశ్‌ ఎంతో కాలంగా తనను, తన తల్లిని వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

ఈనెల 10న హనుమంత నగర్‌ లోని తమ నివాసానికి వచ్చిన ఆయన, తన తల్లిని ఇంటి నుంచి గెంటేశాడని, తాను ధరిస్తున్న దుస్తులు అసభ్యంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలంతో దూషించాడని చెప్పింది. జయశ్రీ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు, విచారణకు హాజరు కావాలంటూ గిరీశ్ కు సూచించారు. ఇద్దరినీ విచారించిన అనంతరం కేసు నమోదు విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Jayasri Ramayya
Sandalwood
బుచసక
  • Loading...

More Telugu News