drdo: ఓర్వకల్లులో డీఆర్‌డీవో క్షిపణి పరీక్ష.. సక్సెస్!

  • ఆర్మీ సహకారంతో మిసైల్ టెస్ట్
  • జవాను కూడా మోసుకెళ్లగలిగే క్షిపణి రూపకల్పన
  • లక్ష్యాన్ని తుత్తినియలు చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డీఆర్‌డీవో నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఆర్మీ సహకారంతో మిసైల్ టెస్ట్ నిర్వహించగా అది విజయవంతమైనట్టు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. ఆర్మీ జవాను మోసుకెళ్లేలా డీఆర్‌డీవో రూపొందించిన అతి తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ను ఇక్కడ పరీక్షించగా అది విజయవంతంగా గమ్యాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. నిర్ణీత సమయానికే అది లక్ష్యాన్ని తుత్తినియలు చేసినట్టు పేర్కొన్నారు

drdo
orvakallu
missile test
Kurnool District
army
  • Loading...

More Telugu News