Jagan: ఏపీ ప్రభుత్వం ఇదే పని మొదట్లోనే చేసుంటే ఇంత ప్రతిఘటన వచ్చేది కాదుగా!: టీడీపీ నేత కళా వెంకట్రావు

  • వైసీపీ బాధితులను వారి స్వగ్రామాలకు తరలించారు
  • పోలీసు వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
  • ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి

వైసీపీ బాధితులను వారి స్వగ్రామాలకు పోలీసులు తరలించారని, ఇదే పని మొదట్లోనే చేసుంటే బాగుండేదని, ప్రభుత్వంపై ఇంత ప్రతిఘటన వచ్చేది కాదని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఈరోజు తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో 5,224 మంది పాల్గొన్నారని చెప్పారు. ‘ఛలో ఆత్మకూరు’తో వైసీపీ బాధితులకు భరోసా కల్పించామని, తమ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపామని  అన్నారు. 70 మంది టీడీపీ నాయకులను గృహనిర్బంధం చేశారని, 1,144 మందికి పైగా తమ కార్యకర్తలను అరెస్టు చేశారని చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను వైసీపీ నాయకులు చెప్పుచేతల్లో పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.

Jagan
kala venkata rao
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News