Andhra Pradesh: రాజధానిపై బొత్స స్టేట్ మెంట్ ఇచ్చినా సీఎం జగన్ స్పందించలేదు!: ఎంపీ సుజనా చౌదరి

  • ఏపీ గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిసిన బీజేపీ నేతలు
  • రాజధాని పట్ల రైతులు ఆందోళనలో ఉన్నారు
  • సీఎం ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారు

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నప్పటికీ సీఎం జగన్ స్పందించడం లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. ఏపీ గవర్నర్ ను రాజ్ భవన్ లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తదితరులు ఈరోజు కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశంపై అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండటంతో రాజధాని పట్ల రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు. సీఎం జగన్ ని, సంబంధిత మంత్రిని కలిసేందుకు రైతులకు అవకాశం దొరకలేదని చెప్పారు.

ఇంత జరుగుతున్నా ఒక్క స్టేట్ మెంట్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదని, ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదని విమర్శించారు. సీఎం ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, ఈ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్టు చెప్పారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టతను ఇచ్చేలా చూడాలంటూ గవర్నర్ కు విన్నవించినట్టు చెప్పారు.

Andhra Pradesh
amravathi
BJP
Sujana Chowdary
  • Loading...

More Telugu News