Chinthamaneni Prabhakar: చింతమనేనిని రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు

  • గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని
  • నేడు తన నివాసం వద్దకు వచ్చిన టీడీపీ నేత
  • అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన... కాసేపటి క్రితం దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ మకాం వేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చింతమనేని అరెస్ట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో, పోలీసులకు-చింతమనేని అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో, చింతమనేనిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయనను రహస్య ప్రాంతానికి తరలించారు. ఆయనను ఎక్కడకి తరలించారనే విషయం తెలియాల్సి ఉంది.

Chinthamaneni Prabhakar
Telugudesam
Arrest
  • Loading...

More Telugu News