Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు కూడా హిట్లర్, ముస్సోలినిల గతే!: యనమల రామకృష్ణుడు

  • అదే తరహాలో జగన్ పాలన అంతమవుతుంది
  • ఏపీలో ప్రస్తుతం ఫాసిస్టు పాలన సాగుతోంది
  • బాధితులకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ముస్సోలిని, హిట్లర్ ను మించిపోయారని దుయ్యబట్టారు. వైసీపీ బాధిత శిబిరాల్లోని బాధితులకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే వారికి న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారనీ, ఇది దారుణమని వ్యాఖ్యానించారు. హిట్లర్, ముస్సోలినీల చరిత్ర ముగిసిపోయినట్లే జగన్ పాలన కూడా అంతమవుతుందని జోస్యం చెప్పారు. ఇంత క్రూరమైన, కఠోర పాలనను తామెన్నడూ చూడలేదని తెలిపారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్య పాలన ఉందా? ఫాసిస్టు పాలన ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఫాసిస్టు పాలనను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

Andhra Pradesh
Telugudesam
Yanamala
Chalo atmakur
  • Loading...

More Telugu News