Malaria: మలేరియా కేసుల నమోదులో భారత్కు నాలుగో స్థానం
- భారత్ కంటే ముందు నైజీరియా, కాంగో, మొజాంబిక్ దేశాలు
- 2017లో ప్రపంచవ్యాప్తంగా 21.90 కోట్ల కేసులు నమోదు
- ఒక్క భారత్లోనే కోటికి పైగా కేసులు
మలేరియా కేసుల నమోదులో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2017లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్లోనే నమోదయ్యాయని లాన్సెజ్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 21.90 కోట్ల కేసులు నమోదు కాగా, ఒక్క భారత్లోనే కోటికిపైగా కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, కాంగో, మొజాంబిక్లు వరుసగా భారత్ కంటే ముందున్నాయి. ఈ నివేదికపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ మలేరియాను దేశం నుంచి తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, టీబీ, మెదడువాపు వ్యాధి, కాలా జ్వరం వంటి వాటిని కూడా నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.