Chandrababu: నిరాహార దీక్ష చేస్తున్నా: చంద్రబాబు

  • రాత్రి 8 గంటల వరకూ దీక్ష
  • బాధితుల హక్కులను పరిరక్షిస్తాం
  • మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు

తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసుల అండతో కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. రాత్రి 8 గంటల వరకూ తాను దీక్షలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసినంత మాత్రాన వైసీపీ సర్కారు చేస్తున్న తప్పులన్నీ ఒప్పులు కాబోవని అన్నారు.

జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, దీన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో బాధితుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా టీడీపీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బాధితులకు సంఘీభావంగా ఎక్కడికక్కడే నిరసనలు తెలియజేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Chandrababu
Hunger Strike
Chalo Atmakuru
  • Loading...

More Telugu News