Guntur District: ‘ఛలో ఆత్మకూరు’కు వెళ్లకుండా లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు

  • లోకేశ్‌ను ఆయన నివాసం వద్దే అడ్డగింత
  • పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు
  • గుంటూరు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి బయలుదేరిన లోకేశ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు, ‘ఛలో ఆత్మకూరు’కు బయలుదేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. 

Guntur District
Chalo Atmakur
Nara Lokesh
  • Loading...

More Telugu News