Telugudesam: ‘ఛలో ఆత్మకూరు’ ఎఫెక్ట్...గుంటూరులో టీడీపీ శిబిరం వద్ద హై అలర్ట్!

  • టీడీపీ శిబిరం పరిసరాలను పరిశీలించిన అదనపు డీజీ
  • శిబిరం వద్ద పరిస్థితి అంచనా వేస్తున్న అధికారులు 
  • టీడీపీ నేతల గృహ నిర్బంధాలు.. బైండోవర్ కేసులు  

రేపు టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో బైండోవర్లు ప్రారంభమయ్యాయి. సత్తెనపల్లిలో 16 మంది టీడీపీ నాయకులను పోలీసులు బైండోవర్ చేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకులు కొందరిని గృహనిర్బంధం చేయగా, మరికొందరిపై బైండోవర్ కేసులు పెట్టారు. కాగా, గుంటూరులోని టీడీపీ శిబిరం వద్ద హై అలర్ట్ నెలకొంది. ఈ శిబిరం పరిసరాలను శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ పరిశీలించారు. ఆయన వెంట పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. శిబిరం వద్ద పరిస్థితి అంచనా వేస్తున్నారు.

Telugudesam
Chandrababu
chalo Atmakur
YSRCP
  • Loading...

More Telugu News