Reverse Tender: రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు!: టీడీపీ అధినేత చంద్రబాబు

  • రివర్స్ ఎన్నికలు మాత్రం రావు ‘జమిలి’ రావొచ్చు
  • రాజధాని అమరావతిని పురిట్లోనే చంపేశారు
  • అవినీతిలో చిక్కుకుపోయిన వ్యక్తా నాపై ఆరోపణలు చేసేది?

రివర్స్ టెండరింగ్ కు బదులు రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెటైర్ వేశారు. టీడీపీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రివర్స్ ఎన్నికలు మాత్రం రావు కానీ, మూడేళ్లలో జమిలి ఎన్నికలు రావొచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి న్యాయవిభాగం వెన్నుదన్నుగా నిలబడిందని, అప్పటి ప్రభుత్వ అరాచకాలపై పోరాడిందని గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడు మళ్లీ అంతకు మించిన అరాచకాలు జరుగుతున్నాయని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ హయాంలో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతికి శ్రీకారం చుడితే దాన్ని పురిట్లోనే చంపేశారని వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అవినీతిలో చిక్కుకుపోయి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లిన వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా సీఎం జగన్ పై ఆరోపణలు గుప్పించారు.

Reverse Tender
Telugudesam
Chandrababu
Jagan
  • Loading...

More Telugu News