Balakrishna: బాలకృష్ణగారితో నటించడానికి భయపడేదాన్ని: సీనియర్ హీరోయిన్ సంఘవి

  • సీనియర్ హీరోలందరితో చేశాను 
  • బాలకృష్ణగారికి కోపం ఎక్కువని విన్నాను 
  • నా భయాన్ని ఆయన పోగొట్టారన్న సంఘవి

తెలుగు తెరకి 'తాజ్ మహల్' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన సంఘవి, ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించింది.

"తెలుగులో నేను చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ ల సరసన నటించాను. బాలకృష్ణగారితో నేను 'సమరసింహా రెడ్డి'.. 'గొప్పింటి అల్లుడు' సినిమాలు చేశాను. 'సమరసింహారెడ్డి' షూటింగు సమయంలో ఆయనను చూస్తేనే భయపడిపోయేదానిని. నేను దూర దూరంగా ఉండటం గమనించి ఆయన కారణం అడిగారు. 'మీకు కోపం ఎక్కువని విన్నాను సార్ .. అందుకని' అన్నాను నేను. తనకి కోపమే రాదని చెబుతూ ఆయన నా భయాన్ని పోగొట్టారు. మరుసటి రోజు నుంచి భయపడకుండా ఆయన కాంబినేషన్లోని సీన్స్ ను చేశాను" అని చెప్పుకొచ్చింది.

Balakrishna
Sanghavi
  • Loading...

More Telugu News