Telugudesam: రేపు ఉదయం రోడ్డుమార్గంలో ఆత్మకూరు చేరుకోనున్న చంద్రబాబు

  • వైసీపీ దాడులను నిరసిస్తూ రేపు ‘ఛలో ఆత్మకూరు’
  • 8 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరనున్న బాబు
  • పునరావాస శిబిరానికి వెళ్లి అక్కడి నుంచి ఆత్మకూరుకు 

టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులను నిరసిస్తూ ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రేపు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. గుంటూరు, అరండల్ పేటలోని పునరావాస శిబిరానికి తొమ్మిది గంటలకు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆత్మకూరు బయలుదేరి వెళతారని సమాచారం.

ఇదిలా ఉండగా, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లిన వారిని తిరిగి గ్రామానికి వచ్చేలా చర్యలు ప్రారంభించారు. గ్రామం వదిలి వెళ్లిన మాజీ సర్పంచ్ షేక్ చింతపల్లి జానీబాషా సహా మరో 18 మందిని తీసుకొచ్చారు. ఎటువంటి గొడవలు జరగకుండా పిన్నెల్లి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.      

Telugudesam
Chandrababu
chalo Atmakur
YSRCP
  • Loading...

More Telugu News