Sujeeth: నేను గొప్పలు చెప్పుకునే రకం కాదు: 'సాహో' దర్శకుడు సుజీత్
- సినిమా చూశాక ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చు
- నన్ను టార్గెట్ చేయడం కరెక్టు కాదు
- అందుకే మౌనంగా ఉంటున్నానన్న సుజీత్
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో ఇటీవల 'సాహో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సుజీత్ ఈ సినిమాను అంచనాలకి తగినట్టుగా రూపొందించలేకపోయాడనే టాక్ బలంగా వినిపించింది. తాజాగా ఈ విషయంపైనే సుజీత్ స్పందించాడు.
"ఈ సినిమా చూసినవాళ్లు నచ్చితే బాగుందని చెప్పొచ్చు .. లేదంటే బాగోలేదని అనొచ్చు. కానీ నన్ను టార్గెట్ చేస్తూ .. నేనేదో నేరం చేసినట్టుగా ట్రీట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో నేను ఏది మాట్లాడినా దాని అర్థం .. ఆంతర్యం మారిపోయి బయటికి వస్తున్నాయి. బీహార్ లో నాకు గుడికడతామని కొంతమంది అభిమానులు నాకు కాల్ చేసి చెప్పారనే విషయాన్ని నేను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసలా మాటే నా నోటి వెంట రాలేదు. గొప్పలు చెప్పుకునే అలవాటు నాకు మొదటి నుంచి లేదు. ఇలాంటి సంఘటనల వల్లనే మౌనంగా ఉండటం మంచిదని భావించి అలాగే ఉంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.