Chandrababu: నేడు చంద్రబాబు, భువనేశ్వరి మ్యారేజ్ డే... స్పందించిన లోకేశ్!
- అమ్మ ఏడడుగులు నడిచిన రోజు
- ఆదర్శ దంపతులు నూరేళ్లు వర్థిల్లాలి
- ట్విట్టర్ లో నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరిల పెళ్లి రోజు నేడు కాగా, వారి కుమారుడు లోకేశ్, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేసిన ఆయన, "ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు" అని అన్నారు.