Chalo Atmakur: పల్నాడులో 144 సెక్షన్.. ‘చలో ఆత్మకూరు’కు అనుమతి లేదన్న ఏపీ డీజీపీ

  • అనుమతి కోరితే పరిశీలిస్తాం
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఊరేగింపులకు అనుమతి ఇవ్వబోం
  • శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదు

టీడీపీ తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’కు అనుమతి లేదని, కోరితే పరిశీలిస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. పల్నాడులో 144 సెక్షన్ విధించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేపట్టే ఊరేగింపులకు అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు శ్రీనివాసరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని, అతడి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదని అన్నారు. నిజానికి వివేకా హత్యకేసులో శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించనే లేదని డీజీపీ తెలిపారు.

Chalo Atmakur
Telugudesam
Andhra Pradesh
DGP
  • Loading...

More Telugu News