Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం

  • ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్ కు విరాట్ కోహ్లీ పేరు
  • గురువారం ఆవిష్కరణ కార్యక్రమం
  • ఢిల్లీ తరలిరానున్న టీమిండియా ఆటగాళ్లు

క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా పేరుగాంచిన కోహ్లీ సొంతగడ్డపై అపురూపమైన గౌరవానికి నోచుకున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్ కు కోహ్లీ పేరు పెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లంతా తరలిరానుండడం కార్యక్రమానికి మరింత కళ తెచ్చిపెట్టనుంది. ఈ వేడుక అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం ధర్మశాల పయనం అవుతుంది. కాగా, ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి కూడా పేరు మార్చుతున్నారు. ఇటీవలే కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఆయన పేరిట నామకరణం చేస్తున్నారు. గతంలో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా జైట్లీ విశేష సేవలందించారు.

Virat Kohli
Team India
Delhi
DDCA
  • Loading...

More Telugu News