KCR: తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు!

  • అసెంబ్లీ ముందుకు 2019-20 బడ్జెట్
  • ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్
  • విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తెస్తున్నా
  • గత బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తగ్గింపు
  • రూ. 1,46,492 కోట్ల అంచనాలు

2019-20 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్, కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, మాంద్యం ప్రభావం రాష్ట్రంపై నామమాత్రమేనని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడటంతో, జాతీయ సగటుతో పోలిస్తే అధిక జీడీపీ సాధ్యమేనని అన్నారు.
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
* 2019-20 సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ. 1,46,492 కోట్లు.
* ఫిబ్రవరిలో సమర్పించిన అంచనా రూ. 1.82 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గిన అంచనాలు.
* దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రం.
* గత ఐదేళ్లలో ఎన్నో వినూత్న పథకాలు.
* 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెలకు ఖర్చు రూ. 6,247 కోట్లు.
* ఈ సంవత్సరం నెలకు రూ. 11,305 కోట్లు ఖర్చవుతోంది.
* గడచిన ఐదేళ్ల వ్యవధిలో ఆదాయ వృద్ధి సాలీనా 21.49 శాతం.
* 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.8 శాతం.
* రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 10.20 శాతానికి పెరిగింది.
* రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు.
* మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.
* బడ్జెట్ అంచనాలో మిగులు రూ. 2,044.08 కోట్లు.
* ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు.
* 29 శాతం తగ్గిన పన్నేతర ఆదాయం.
* రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెడుతున్న కేంద్రం.
* అన్ని రంగాలకూ నాణ్యమైన విద్యుత్ ను రోజంతా అందిస్తున్నాం.
* రైతు బంధు, రైతు బీమాలతో రైతాంగానికి ఎంతో మేలు.
* సుస్థిరమైన అభివృద్ధిని సాధ్యం చేసి చూపించాం.
* రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం.
* వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిని సాధించాం.
* ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికి పైగా పెరిగింది.
* గురుకులాల పేరుతో అత్యున్నత ప్రమాణాలతో విద్య.
* రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో లక్ష మందికి పైగా చదువుతున్నారు.
* మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల్లో నీరు చేరింది.
* ప్రతి ఒక్కరికీ మంచి నీటి కొరత లేకుండా చేసి చూపుతాం.
* కనిపిస్తున్న గణాంకాలన్నీ మాంద్యం ఉందని చూపుతున్నాయి.
* వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గడం కూడా ఇందుకు నిదర్శనం.
* వాహనాల కొనుగోలు 10 శాతానికి పైగా తగ్గింది.
* కొనేవారు లేక దిక్కులేకుండా పడివున్న వేలాది వాహనాలు.
* వాహన అమ్మకాలు సాగితే, మరింత ఆదాయం లభించివుండేది.
* విమానయాన రంగంతో పాటు గూడ్స్ రైళ్ల బుకింగ్ పైనా మాంద్యం ప్రభావం.
* రూపాయి మారకపు విలువ దారుణంగా పడిపోవడం భయాన్ని కలిగిస్తోంది.
* ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుడ్డిలో మెల్లలా రాష్ట్ర పరిస్థితి.
* విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది.
* గత బడ్జెట్ కు, ఇప్పటి బడ్జెట్ కు ఎంతో తేడా ఉంది.
* కేంద్ర, రాష్ట్రాల ఆదాయ వృద్ధి గణనీయంగా పడిపోయింది.
* ప్రజోపయోగ కార్యక్రమాలకు రూ. 1,03,551 కోట్లు.
* రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 5.8 శాతం వృద్ధి లక్ష్యంగా ముందడుగు.
* ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కొనసాగుతాయి.
* రైతు బంధు పథకాన్ని ఆపాలన్న ఆలోచనే లేదు.
* ఈ సంవత్సరం రైతు బంధుకు రూ. 12 వేల కోట్లు.
* రైతు బీమా కోసం రూ. 1,135 కోట్లు.
* ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 8 వేల కోట్లు.
* త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల మంజూరు.
* కల్యాణలక్ష్మి, పెన్షన్ స్కీములన్నీ కొనసాగుతాయి.
* కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి రూ. 2,031 కోట్లు.
* ప్రజలకు మేలు చేయని పథకాలను అమలు చేసే ఉద్దేశం లేదు.
* కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ. 31,802 కోట్లు.
* ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు.
* రైతు రుణ మాఫీకి రూ. 6 వేల కోట్లు.
* ఆరోగ్య శ్రీ బెస్ట్ కాబట్టే 'ఆయుష్మాన్ భారత్' వద్దన్నాం.
* మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు.
* పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు.
* గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు.
* రైతు బీమా ప్రీమియానికి రూ. 1,137 కోట్లు.
* కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఇకపై ఉద్యోగాల నియామకం.
* వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల పింఛన్ రూ. 1000 నుంచి రూ. 2016కు పెంపు.
* బీడీ కార్మికులకు పింఛన్ కటాఫ్ తేదీ తొలగింపు.
* వికలాంగులకు, వృద్ధ కళాకారుల పింఛన్ రూ. 3,016కు పెంపు.
* ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్ లో రూ. 9,402 కోట్ల విలువైన ప్రతిపాదనలు.
* ఆరోగ్య శ్రీకి రూ. 1,336 కోట్లు.

  • Loading...

More Telugu News