Botsa Satyanarayana: చంద్రబాబుకు పవన్ కల్యాణ్ రాజకీయ బినామీ.. దొనకొండ ఎక్కడుందో నాకు తెలియదు: బొత్స సత్యనారాయణ

  • రాజకీయ బినామీ కాబట్టే టీడీపీ గొంతుకను వినిపిస్తున్నారు
  • అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాం
  • కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రపంచ బ్యాంకు తప్పుకుంది

ఇటీవలి కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వేడి పుట్టిస్తున్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నేరుగా టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ కల్యాణ్ రాజకీయ బినామీ అని వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీ గొంతుకను పవన్ వినిపిస్తున్నారని విమర్శించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగబోదని తెలిపారు. అమరావతి నిర్మాణానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దొనకొండ ఎక్కుడుందో తనకు తెలియదని అన్నారు.

రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని బొత్స చెప్పారు. జగన్ వంద రోజుల పాలనకు 100 మార్కులు పడ్డాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ తనంతట తానే వెనక్కి వెళ్లలేదని... రుణం వద్దని కేంద్ర ప్రభుత్వం సూచించడంతోనే తప్పుకుందని తెలిపారు. సంక్షేమ పథకాలకు సాయం చేసేందుకు వరల్డ్ బ్యాంక్ ఇప్పటికీ సిద్ధంగా ఉందని చెప్పారు. విశాఖ భూకుంభకోణంలో ఏ పార్టీవారు ఉన్నా వదిలిపెట్టబోమని... కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Botsa Satyanarayana
Amaravathi
World Bank
Chandrababu
Pawan Kalyan
Jagan
Telugudesam
Janasena
YSRCP
  • Loading...

More Telugu News