Telangana: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేడు.. అసెంబ్లీలో కేసీఆర్.. మండలిలో హరీశ్ రావు!
- ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ సమావేశాలు
- శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేసీఆర్.. మండలిలో హరీశ్ రావు
- నేటి సమావేశాలు ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ ను ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలిలో ఆర్థిక మంత్రి హరీష్ రావులు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రసంగాల తర్వాత నేటి అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడతాయి. శనివారం బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఈరోజు సమావేశాలు ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ఏడాది బడ్జెట్ తగ్గనుంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 1.81 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి ఇది రూ. 1.70 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. లో-ఇరిగేషన్ కు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 22,500 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 20 వేల కోట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉంది.