Chandrayaan-2: 'చంద్రయాన్-2' ఆర్బిటర్ ఏడున్నరేళ్ల వరకు పనిచేసే అవకాశం వుంది: ఇస్రో చైర్మన్ శివన్

  • చివరి దశలో సంకేతాలు అందించడం మానేసిన విక్రమ్ ల్యాండర్
  • చంద్రయాన్-2కి చివర్లో విఘాతం
  • ఆర్బిటర్ అందించే సమాచారం కూడా ఉపయుక్తమేనన్న ఇస్రో చైర్మన్

చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు అందించడం మానేయడంతో ఇస్రో వర్గాలు తీవ్ర నిరాశకు లోనయ్యాయి. అయితే, ఊరట కలిగించే విషయం ఏమిటంటే, విక్రమ్ ల్యాండర్ ను మోసుకెళ్లిన ఆర్బిటర్ మాత్రం ఇంకా చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. ముందు నిర్దేశించిన విధంగా ఆర్బిటర్ కాలావధి ఏడాది మాత్రమేనని, అయితే, అందులో ఇప్పుడు అదనపు ఇంధనం ఉన్న దృష్ట్యా ఏడున్నరేళ్ల వరకు అది పనిచేయవచ్చని అంచనా వేస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. ఆర్బిటర్ అందించే సమాచారం కూడా ఎంతో ఉపయుక్తమేనని భావిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News