KCR: తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారేమోనని భయపడ్డాను: నరసింహన్ పై కేసీఆర్ వ్యాఖ్యలు

  • నరసింహన్ వీడ్కోలు సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
  • తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు నరసింహన్ వచ్చారని వెల్లడి
  • తనను తమ్ముడిలా ఆదరించారన్న సీఎం

సుదీర్ఘ కాలం పాటు గవర్నర్ గా వ్యవహరించిన ఈఎస్ఎల్ నరసింహన్ కు వీడ్కోలు పలకాల్సి రావడం ఎంతో బాధాకరమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నరసింహన్ వీడ్కోలు సభలో కేసీఆర్ మాట్లాడారు.  తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు నరసింహన్ వచ్చారని, ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారేమోనని భయపడ్డానని కేసీఆర్ అన్నారు. కానీ, వచ్చీరావడంతోనే తెలంగాణ గురించి, ఉద్యమం గురించి ఎంతో ఆసక్తితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారని, దాంతో, తెలంగాణ ఉద్యమం గురించి కేంద్రానికి సానుకూల నివేదికలే పంపుతారని అర్థమైందని చెప్పారు.

తనను ఓ సీఎంలా కాకుండా సోదరుడిలా భావించారని, ఇప్పుడాయన వెళ్లిపోతుంటే చాలా బాధ కలుగుతోందని అన్నారు. కానీ, ఆయన వెళ్లిపోక తప్పదని, భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News