TRS: టీఆర్ఎస్ రెండు ముక్కలు కావడం ఖాయం: రేవూరి ప్రకాశ్ రెడ్డి

  • తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది
  • మనవడితో తలంబ్రాలు మోయించిన చరిత్ర కేసీఆర్ ది
  • రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది

కాంట్రాక్టుల పేరుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దోచి పెడుతున్నారని బీజేపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. త్యాగాలతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. మనవడితో రాముడికి తలంబ్రాలు మోయించిన చరిత్ర కేసీఆర్ దని అన్నారు. రాచరిక పాలనను తలపించే రీతిలో ఆయన పాలన ఉందని విమర్శించారు.

రానున్న రోజుల్లో టీఆర్ఎస్ రెండు ముక్కలు కావడం ఖాయమని... ఈటల రాజేందర్, రసమయి వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పోషించలేకపోతోందని... టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు.

TRS
KCR
Revuri Prakash Reddy
BJP
  • Loading...

More Telugu News