Narasimhan: ప్రగతి భవన్ వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి చేదు అనుభవం

  • కాసేపట్లో నరసింహన్ కు వీడ్కోలు సభ
  • ప్రగతి భవన్ లోకి పద్మా దేవేందర్ రెడ్డిని అనుమతించని పోలీసులు
  • ఎమ్మెల్యేలకు అనుమతి లేదని ఆపివేసిన వైనం

ఈ రోజు తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలకబోతున్నారు. హైదరాబాదులోని ప్రగతి భవన్ లో వీడ్కోలు సభను కాసేపట్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రగతి భవన్ కు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేరుకుంటున్నారు.

మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు. అయితే, ఆమెను పోలీసు అధికారులు లోపలికి అనుమతించలేదు. కేవలం మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాత్రమే అనుమతి ఉందని... ఎమ్మెల్యేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అధికారులు చెప్పింది విని పద్మా దేవేందర్ రెడ్డి షాక్ కు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

Narasimhan
Sendoff
Pragathi Bhavan
Padma Devender Reddy
TRS
  • Error fetching data: Network response was not ok

More Telugu News