Andhra Pradesh: ఈ వందరోజుల పాలన ఏపీకి ఓ శాపం: చంద్రబాబునాయుడు
- వందరోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదు
- ఏపీలో తీవ్రవాద ప్రభుత్వం ఉందని అనలేదా!
- ఒకరిద్దరు నేతలు టీడీపీని వీడినా వచ్చే నష్టమేమీ లేదు
పోలవరం ప్రాజెక్టు భద్రతతో ఆడుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. రేపు పోలవరానికి ఏమైనా జరిగితే గోదావరి జిల్లాలు ఏమవుతాయి? అని ప్రశ్నించారు. వైసీపీ వందరోజుల పాలన ఏపీకి ఓ శాపంగా అభివర్ణించారు. వందరోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదని విమర్శించారు. ఏపీలో వున్నది తీవ్రవాద ప్రభుత్వమని పారిశ్రామికవేత్తలు అనేలా చేశారని విమర్శించారు.
తోట త్రిమూర్తులు పార్టీని వీడే విషయం గురించి మాట్లాడుతూ, ఈ విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. స్వలాభాల కోసం టీడీపీని వీడుతూ, తనపై అపవాదులు వేయడం సరికాదని హితవు పలికారు. ఒకరిద్దరు నేతలు వెళ్తే టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదని, టీడీపీ పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.