Andhra Pradesh: ఏపీలో ఇలాంటి రాక్షసపాలన ఎప్పుడూ చూడలేదు!: చంద్రబాబు

  • ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన వాళ్లూ గతంలో ఇలా ప్రవర్తించలేదు
  • కక్షపూరిత రాజకీయాలకు జగన్ శ్రీకారం చుట్టారు
  • మా వాళ్లపై 21 కేసులు బనాయించారు

ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షసపాలన ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కూడా ఎవ్వరూ గతంలో ఇలా ప్రవర్తించలేదని, కక్షపూరిత రాజకీయాలకు జగన్ తొలిసారి శ్రీకారం చుట్టారని, ఇలాంటి విధ్వంసకర రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేవని అన్నారు.

టీడీపీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. తూర్పుగోదావరి జిల్లాలో తమ వాళ్లపై 21 కేసులు బనాయించారని, తమపై దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారని అన్నారు. పోలీసులకు అత్యుత్సాహం పనికిరాదని సూచించారు. పోలీసుల్లో ఇంత దిగజారుడుతనం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఐపీఎస్ అధికారులే ఇలా వ్యవహరిస్తే ఎలా? అని ప్రశ్నించారు.  

ప్రతీకారం తీర్చుకునేందుకా ప్రజలు మీకు ఓటు వేసింది?

‘ప్రతీకారం తీర్చుకునేందుకా ప్రజలు మీకు ఓటు వేసింది? మీ అధికారం శాశ్వతం కాదు..అమరావతి శాశ్వతం’ అంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి గొప్ప రాజధాని నగరం వద్దా? అని ప్రశ్నించారు. పులివెందుల పంచాయితీని రాష్ట్ర మంతా జగన్ విస్తరిస్తున్నారని, ఆఖరికి పోలవరం ప్రాజెక్టుపైనా ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి లేదని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు తప్ప వైసీపీకి సొంత క్యాడర్ లేదని, ఆ పార్టీకి ఏదో అవకాశం కలిసొచ్చి అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. తన భద్రత గురించి మాట్లాడుతూ, తనకు రక్షణగా పోలీసులను పంపకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News