Bunny Vasu: జనసేన కోసం పని చేస్తే... సినిమా అవకాశాలు ఇవ్వాలా?: నటి సునీత ఆరోపణలపై నిర్మాత బన్నీ వాసు రియాక్షన్ వీడియో!

  • రెండు రోజుల క్రితం ఆర్టిస్ట్ సునీత నిరసన
  • సానుభూతి కోసమే ఇటువంటి పనులు
  • టాలెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయన్న బన్నీ వాసు

జనసేన పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి, పార్టీ కోసం పవన్ కల్యాణ్ వాడుకున్నారని ఆరోపిస్తూ, క్యారెక్టర్ నటి బోయ సునీత, రెండు రోజుల క్రితం ఫిల్మ్ చాంబర్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆమె నిర్మాత బన్నీ వాసుపైనా విమర్శలు గుప్పించి, టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించాలని డిమాండ్ చేసింది. దీనిపై తాజాగా, ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాసు స్పందించాడు.

జనసేన పార్టీలో కార్యకర్తగా పనిచేసినంత మాత్రాన సినిమాల్లో అవకాశాలు రావని, టాలెంట్ ఉంటేనే వస్తాయని స్పష్టం చేశారు. తన దుందుడుకు స్వభావంతో ఎప్పటికప్పుడు వైఖరిని మార్చుకుంటూ ఆమె వెళ్లిందని, తాను కేవలం అమ్మాయినన్న కారణంతోనే సానుభూతి లభిస్తుందని ఇటువంటి పనులు చేస్తోందని అన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ బెదిరింపులకు దిగిందని ఆరోపించారు. సునీత విషయంలో బన్నీ వాసు ఏమన్నారో ఈ వీడియోలో మీరూ చూడవచ్చు.

Bunny Vasu
Jana Sena
Boya Sunitha
  • Error fetching data: Network response was not ok

More Telugu News