Court]: భర్తపై తప్పుడు కేసు పెట్టిన యువతి... తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం!

  • కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఘటన
  • భర్త రెండో వివాహం చేసుకున్నాడని కోర్టులో ప్రైవేట్ కేసు
  • ఐదేళ్ల తరువాత ఆధారాలు లేవనడంతో జరిమానా

తన భర్తపై తప్పుడు కేసు పెట్టి, సుమారు ఐదు సంవత్సరాల పాటు కోర్టు సమయాన్ని వృథా చేసిన ఓ యువతి పట్ల న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆమెపై రూ. 3 వేల జరిమానా విధిస్తున్నామని, అది చెల్లించకుంటే, 15 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పిచ్చారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది.

 వివరాల్లోకి వెళితే, తన భర్త శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆమెతో పిల్లలను కూడా కన్నాడని ఆరోపిస్తూ, ఆత్మకూరుకు చెందిన మంగళి గౌరీదేవి అనే యువతి, 2014లో ప్రైవేట్‌ కేసు దాఖలు చేసింది. కేసు విచారణ ఐదు సంవత్సరాల పాటు సాగిన తరువాత, తన ఆరోపణలను నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలూ లేవని ఆమె స్పష్టం చేయడంతో, ఇన్‌ చార్జ్‌ మేజిస్ట్రేట్‌ ఫకృద్దీన్‌ కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపారు. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కేసును కోర్టు ముందుకు తెచ్చి సమయాన్ని వృథా చేసినందుకు జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News