JIO: గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినమ్... జియో ఫైబర్ ప్లాన్లు ఇవిగో!

  • ఇప్పటిదాకా టెలికాంపై దృష్టిపెట్టిన జియో
  • తాజాగా బ్రాడ్ బ్యాండ్ రంగంలో అడుగుపెట్టిన దిగ్గజం
  • పలు ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం

భారత టెలికాం రంగంలో ఓ విప్లవం అని జియో గురించి చెబుతుంటారు. ఇప్పుడు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగదారుల వద్దకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ సంస్థ జియో ఫైబర్ పేరుతో కొన్ని ప్లాన్లు ప్రకటించింది. బ్రాడ్ బ్యాండ్ సేవల్లోనూ ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు జియో ఫైబర్ ఇవాళ్టి నుంచి అధికారికంగా షురూ అయింది. కనిష్టంగా రూ.699, గరిష్టంగా రూ.8,499 చెల్లింపుతో వివిధ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రతి ప్లాన్ కు నెలవారీ, వార్షిక ప్లాన్ అంటూ వెసులుబాటు కల్పించారు.

బ్రాంజ్: ఇది నెలకు రూ.699, ఏడాదికి రూ.3,388 చెల్లిస్తే అందుబాటులోకి వస్తుంది. దీంట్లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో నెలకు 150 జీబీ డేటా ఇస్తారు. వార్షిక్ ప్లాన్ తీసుకున్నవారికి ఓ బ్లూటూత్ స్పీకర్ ఉచితం.

సిల్వర్: ఈ ప్లాన్ కోసం నెలవారీ అయితే రూ.849, ఏడాది మొత్తానికి రూ.10,188 చెల్లించాలి. దీంట్లోనూ యాన్యువల్ ప్లాన్ కు బ్లూటూత్ స్పీకర్ ఫ్రీగా ఇస్తారు. ఇక దీని డేటా విషయానికొస్తే, 100 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 400 జీబీ డేటా అందిస్తారు.

గోల్డ్: ఈ ప్లాన్ లో నెలకు 750 జీబీ డేటా లభిస్తుంది. నెట్ వేగం 250 ఎంబీపీఎస్. నెలవారీ అయితే రూ.1299, రెండేళ్ల మొత్తానికి అయితే రూ.31,176 చెల్లించాలి. రెండేళ్ల మొత్తానికి ఈ ప్లాన్ తీసుకుంటే 24 అంగుళాల హెచ్ డీ టీవీ ఉచితం.

డైమండ్: దీంట్లో నెలకు రూ.2,499, ఏడాది ప్లాన్ కు రూ.29,988గా నిర్ణయించారు. ఇందులో యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 24 అంగుళాల హెచ్ డీ టీవీ ఉచితంగా లభిస్తుంది. దీంట్లో నెట్ స్పీడ్ 500 ఎంబీపీఎస్. నెలకు 1500 జీబీ డేటా ఇస్తారు.

ప్లాటినమ్: ఈ ప్లాన్ లో నెలవారీ అయితే రూ.3,999, ఏడాది మొత్తానికి అయితే రూ.47,988 చెల్లించాలి. ఇందులో 1 జీబీపీఎస్ స్పీడ్ తో నెలకు 2500 జీబీ డేటా లభ్యమవుతుంది. ఇందులో వార్షిక ప్లాన్ వినియోగదారులకు 32 అంగుళాల హెచ్ డీ టెలివిజన్ ఫ్రీ.

టైటానియమ్: ఇది కంప్లీట్ హైఎండ్ ప్లాన్. నెలవారీ చెల్లింపు అయితే రూ.8,499, వార్షిక ప్లాన్ అయితే రూ.1,01,988గా ధరలు నిర్ణయించారు. ఇందులో నెట్ స్పీడ్ 1జీబీపీఎస్ కాగా, 5000 జీబీ డేటా అందిస్తారు. దీంట్లో యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 43 అంగుళాల అత్యాధునిక 4కే టీవీ ఉచితం.


  • Loading...

More Telugu News