Siddipet District: పుట్టిన రోజునాడు విషాదం...కేక్‌ తిని తండ్రీకొడుకుల మృతి

  • తల్లితోపాటు మరో చిన్నారికి తీవ్ర అస్వస్థత
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
  • వేడుకలకు బాబాయ్‌ కేక్‌ పంపాడంటున్న కుటుంబం

కొడుకు పుట్టిన రోజు కావడంతో ఇంటిల్లిపాది వేడుకల్లో ఆనందంతో మునిగితేలుతున్న వేళ విషాదం చుట్టుముట్టింది. పుట్టిన రోజు కేక్‌ వారిపాలిట మృత్యుదేవత అయ్యింది. కేక్‌ తిన్న కుటుంబ సభ్యుల్లో తండ్రీకొడుకులు మృతి చెందగా తల్లి భాగ్యలక్ష్మి(35), కూతురు పూజిత(12) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్‌లో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబం బంధువులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

ఐనాపూర్‌కు చెందిన రవి (38) దంపతుల కొడుకు రామ్‌చరణ్‌ (8) పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం రామ్‌చరణ్‌ బాబాయి కేక్‌ పంపించాడు. కేక్‌ కట్‌ చేసిన అనంతరం రామ్‌చరణ్‌తోపాటు తల్లిదండ్రులు, మరో చిన్నారి తిన్నారు. కాసేపటికి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అనంతరం రామ్‌చరణ్‌, రవి మృతి చెందడంతో స్థానికులు షాక్ అయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనయిన మిగిలిన ఇద్దరినీ స్థానికులు సమీపంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. అన్నదమ్ముల మధ్య భూవివాదం ఉండడంతో కేక్‌లో విషం కలిపి బాబాయ్‌ శ్రీనివాస్‌ పంపాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Siddipet District
inapur village
Crime News
two died
birthday cake
  • Loading...

More Telugu News