: కంటిమీద కునుకులేని సంజయ్ దత్


ముంబయి పేలుళ్ళ కేసులో శిక్ష అనుభవించేందుకు ఆర్థర్ రోడ్ జైలుకు చేరిన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు నిన్న రాత్రి నిద్ర కరవైంది. గురువారం టాడా కోర్టు ఎదుట హాజరై, అక్కడ లాంఛనాలు పూర్తి చేసిన సంజయ్ దత్ రాత్రి 11 గంటల సమయంలో జైలుకు చేరుకున్నాడు. అక్కడ సింగిల్ బ్యారక్ కేటాయించగా, వెంటనే దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర్నించి వచ్చిన ఆహారాన్ని స్వీకరించిన సంజయ్.. కాసేపటి తర్వాత సిబ్బందిని అడిగి ఓ బాటిల్ నిండా నీళ్ళు తెప్పించుకుని తాగి విశ్రమించాడు. అయితే, నిద్రపోలేదట. రాత్రంతా అసౌకర్యంగా కదులుతూనే ఉన్నట్టు జైలు సిబ్బంది చెబుతున్నారు.

కాగా, కోర్టు నుంచి కారాగారానికి వ్యాన్ లో తరలించే సమయంలో 'మున్నాభాయ్' విలపించాడని ఓ గార్డు వెల్లడించాడు. త్వరలోనే సంజయ్ దత్ ను పుణేలోని యెరవాడ జైలుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News