Jagan: ఎల్లుండి పలాసకు సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • 6న ఉదయం 11 గంటలకు పలాస చేరుకోనున్న జగన్
  • కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం తాగునీటి పథకాలకు శంకుస్థాపన
  • ఎచ్చెర్లలోనూ పలు అభివృద్ధి పనుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎల్లుండి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 11:05 గంటలకు పలాస చేరుకోనున్న జగన్ ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఫిషింగ్ జెట్టీ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్ ప్రాజెక్టును కూడా సీఎం ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. భోజనం తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు తిరిగి అమరావతి బయలుదేరుతారు.

Jagan
Srikakulam District
palasa
  • Loading...

More Telugu News