Allu Arjun: బన్నీ సినిమా మలయాళ వెర్షన్ కు టైటిల్

  • షూటింగు దశలో 'అల వైకుంఠపురములో'
  • మలయాళంలోను విడుదల చేసే ఆలోచన 
  • కీలకమైన పాత్రలో 'టబు'

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణను కొంతవరకూ పూర్తిచేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. బన్నీకి కేరళలోను విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఆయన తెలుగు సినిమాలను మలయాళంలోను భారీ స్థాయిలో విడుదల చేస్తుంటారు.

అలాగే 'అల వైకుంఠపురము'లో సినిమాను కూడా డబ్ చేసి మలయాళంలో విడుదల చేయనున్నారు. తాజాగా మలయాళంలో టైటిల్ ను కూడా ఖరారు చేశారు. మలయాళంలో 'అంగు వైకుంతపురతు' అనే టైటిల్ తో ఈ సినిమాను అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లనున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసినివారు నిర్మిస్తున్న ఈ సినిమాలో 'టబు' ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.

Allu Arjun
Pooja Hegde
Tabu
  • Loading...

More Telugu News