Andhra Pradesh: టీడీపీకి పూర్వవైభవమే లక్ష్యంగా.. రేపటి నుంచి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన!

  • తూర్పు గోదావరి నుంచి పర్యటన షురూ
  • వివరాలు ప్రకటించిన ఎమ్మెల్యే చినరాజప్ప
  • కాకినాడలో టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ

సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలుగుదేశం కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలనీ, పార్టీ కేడర్ లో ధైర్యం నింపాలని నిర్ణయించారు. ఈ నెల 5న చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అచ్చంపేటలోని కల్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారనీ, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. అనంతరం కాకినాడలో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఇలా 13 జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని చినరాజప్ప అన్నారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
state tour
East Godavari District
Nimmakayala Chinarajappa
  • Loading...

More Telugu News