Crime News: చాక్లెట్లు ఇస్తానని చెప్పి పిలిచి.. నాలుగేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడి లైంగిక దాడి!

  • ప్రకాశం జిల్లా మార్టూరులో ఘటన
  • నొప్పితో విలవిల్లాడిన బాలుడు
  • వైద్యులకు చూపించగా అసలు విషయం వెలుగులోకి

అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లివస్తున్న బాలుడికి చాకెట్ల ఆశ చూపి అతనిపై లైంగిక దాడికి పాల్పడిన దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా మార్టూరు పరిధిలోని గొట్టిపాటి హనుమంతరావునగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అందిన వివరాలు ఇలావున్నాయి.

కాలనీకి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు ఆదివారం సాయంత్రం ఎప్పటిలాగే అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి వస్తున్నాడు. బాలుడిని గమనించిన మరో పదహారేళ్ల బాలుడు మాటలు కలిపాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి చాటుకు తీసుకువెళ్లాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి నొప్పితో బాధపడుతుండడంతో బంధువులు సోమవారం చిలకలూరిపేట వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరిశీలించిన వైద్యుడు లైంగిక దాడి జరిగినట్లు నిర్థారించారు. అయితే ఈ విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Crime News
sexual herasment
Prakasam District
martur
  • Loading...

More Telugu News